Nov 11,2023 19:39

పనులు చేపడుతున్న సిబ్బంది

ప్రజాశక్తి - కౌతాళం
ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న ఉరుకుంద రోడ్డు పనులు శనివారం ప్రారంభమయ్యాయి. ఎరిగేరి నుంచి ఉరుకుంద మీదుగా ఆర్‌అండ్‌బి రోడ్డు పనులు ప్రారంభించారు. మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి సహకారంతో రూ.4 కోట్లతో ఈ పనులు చేపడుతున్నట్లు ఆర్‌అండ్‌బి అధికారులు పేర్కొన్నారు. గత పుష్కరాల సమయంలో నుంచి రోడ్డు పరిస్థితి అధ్వానంగా మారింది. రోడ్డు గుంతలమయం కావడంతో శ్రీనరసింహ ఉరుకుంద ఈరన్న స్వామి పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులు ఎన్నో ఇబ్బందులు పడేవారు. భక్తులతో పాటు అటు వైపు కామవరం, చిరుతపల్లి, మల్లనహట్టి, చూడి, హాల్వి తదితర గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయంపై పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఈ సమస్య ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో నిధులు మంజూరు కావడంతో పనులు వేగవంతంగా చేయాలని అధికారులకు ఆదేశించినట్లు వారు పేర్కొన్నారు.