హుండీని లెక్కిస్తున్న సిబ్బంది
ప్రజాశక్తి - కౌతాళం
శ్రీనరసింహ ఉరుకుంద ఈరన్న స్వామి హుండీ లెక్కింపు గురువారం చేపట్టారు. ఈ సందర్భంగా దేవాలయ సహాయ కమిషనర్ వాణి మాట్లాడారు. ఈరన్న స్వామికి రూ.84,30,289 నగదు భక్తులు చెల్లించుకున్నట్లు తెలిపారు. నగదుతో పాటు బంగారం 10 గ్రాముల 300 మిల్లీ గ్రాములు, వెండి 15 కిలోల 620 గ్రాములు వచ్చిందన్నారు. పాలకమండలి ఛైర్మన్ ఆర్.నాగరాజ్ గౌడ్, సభ్యులు రాంప్రసాద్, సూపరింటెండెంట్లు రామ్మోహన్, వెంకటేష్, మల్లికార్జున, సేవాసంఘం సభ్యులు పాల్గొన్నారు.










