
ప్రజాశక్తి - చీరాల
వైసిపి కక్షపూరిత విధానాలు, చంద్రబాబు అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ టిడిపి నేతలు కండువాలతో ఉరేసుకుంటున్నట్లు విన్నుత్నంగా సోమవారం నిరసన తెలిపారు. టిడిపి కార్యలయం వద్ద టిడిపి ఇన్చార్జి ఎంఎం కొండయ్య ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారంకు 27వ రోజుకు చేరాయి. దీక్షలలో నరాల తిరుపతి రాయుడు, తోట సాంబశివరావు, పల్లగొర్ల బాలసుబ్రమణ్యం, కోటి మోహన్‌కృష్ణ, ఎం వెంకటేశ్వర్లు, గోనబోయిన ఏడుకొండలు, గవిని నాగరాజు, పలగర్ల శ్రావణ్, అంగిరేకుల వెంకటేశ్వర్లు, గవిని బ్రహ్మయ్య, కొమ్మనబోయిన రజిని, పలగర్ల మస్తాన్రావు, గవిని సోమయ్య, కీర్తి ప్రసాద్, బచ్చుల సోమయ్య, కీర్తి వెంకటేశ్వర్లు, చప్పిడి శ్రీనివాసరావు, మచ్చని పోలయ్య, పులి సోమయ్య, బుర్ల సుబ్బయ్య, కర్నేటి రవి, కీర్తి సుబ్బారావు, కొండేపి వెంకటేశ్వర్లు, కోటి సాంబశివరావు, రావూరి శేషగిరిలు పాల్గొన్నారు. దీక్ష అనంతరం కొండయ్య నిమ్మరసం యిచ్చి దీక్ష విరమింపచేశారు. కార్యక్రమంలో నాశిక వీరభద్రయ్య, గజవల్లి శ్రీనివాసరావు, యర్రా శివనాగ మల్లేశ్వరి, ఉసురుపాటి సురేష్, తేలప్రోలు నాగేశ్వరరావు, మంచాల చినరామిరెడ్డి, మద్దినేని వెంకటేశ్వరరావు, కూరపాటి పూర్ణ, కొండ్రు రత్నబాబు, బుర్ర కవిత, బుద్ధి దుర్గా మల్లేశ్వరి, దేవన విజయలక్ష్మి, పడవల లలిత పెద్ద సంఖ్యలో నాయకులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు.