
భామిని: మండలంలోని దిమ్మిడిజోల పంచాయతీ దండాసి కాలనీ చెందిన కనపల అమృత (17) ఉరివేసుకొని సోమవారం మృతి చెందింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. దండాసికాలనీకి చెందిన అమృత శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ట్రైబల్ వెల్ఫేర్ పోస్ట్ మెట్రిక్ హాస్టల్‌లో ఉంటూ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ బైసిపి రెండో సంవత్సరం చదువుతోంది. దసరా సెలవులు అనంతరం అమృతను తల్లి ఇందిరా పాతపట్నం పోస్ట్‌మెట్రిక్ హాస్టల్‌కు దిగబెట్టింది. ఇందిరా తిరిగి ఇంటికి వచ్చే సరికి అమృత ఫ్యాన్‌కు ఉరి వేసుకొని మృతి చెందినట్టు ఫోన్ రావడంతో హుటాహుటిన కుటుంబసభ్యులతో పాతపట్నం వెళ్లింది. అమృత తండ్రి మిన్నారావు గ్రీన్ సేవ మిత్రగానూ, తల్లి ఇందిర శుభాకార్యాల్లో వంట మనిషిగా జీవనం సాగిస్తున్నారు. అమృతకు ఇద్దరు తమ్ములు ఉన్నారు. పాతపట్నం సిఐ, ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అమృత మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.