Oct 30,2023 23:19

పొగ మొక్కలు నాటుతున్న కూలీలు

ప్రజాశక్తి-నాగులుప్పలపాడు : వర్షం రైతులను ఊరిసింది. సోమవారం ఉదయం నుంచే ఆకాశంలో నల్లమబ్బులు కమ్మాయి. దీంతో బారీ వర్షం పడుతుందని రైతులు ఆశపడ్డారు. చివరకూ చిరుజల్లులు పడ్డాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలించక పోవడంతో ఖరీఫ్‌ సీజన్‌లో రైతులు పూర్తి స్థాయిలో పంటలు సాగు చేయలేదు. జూన్‌, జులైలో పడిన కొద్దిపాటి వర్షాలకు 1,200ఎకరాల్లో వివిధ పంటలు సాగుచేశారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఆ పంటలు కూడా ఎండుమొఖం పట్టాయి. దీంతో రైతాంగం ఆందోళన చెందారు. రబీ సీజన్‌ ప్రారంభమై నెలరోజులు దాటినా సరైన వర్షాలు లేక పోవడంతో పంటల సాగు ప్రశ్నార్ధకంగా మారింది. రైతులు దుక్కులు దున్ని బలం మందులు చల్లారు. వర్షం కోసం ఎదురు చూస్తున్న సమయంలో తేలికపాటి వర్షం పడి రైతులను ఊరించిందింది. ఈ పాటికే సాగు చేసిన పంటలకు కొద్దిమేర ఊరట నిచ్చింది. ఈ వర్షం పంటల సాగుకు సరిపోదని రైతులు చెబుతున్నారు.