Mar 28,2023 20:10

జుబేర్‌ మృత దేహం

ఉరి వేసుకొని యువకుడు ఆత్యహత్య

ప్రజాశక్తి - పగిడ్యాల

ఉరి వేసుకోని జుబేర్‌ (22) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని పడమర ప్రాతకొట గ్రామంలో మంగళవారం తెలవారు జామున చోటు చేసుకుంది. ముచ్చుమర్రి ఎస్‌ఐ నాగార్జున తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జుబేర్‌ డీగ్రి వరకు చదువుకోని జులైగా తీరుగుతూ ఆటో నడుపుతున్నాడు. ఇంత చదువు చదువుకోని ఆటో నడపుతు జులైగా తిరుగుతున్నావ్‌ ఏదైనా ఉద్యోగం చుసుకోవచ్చుకదా అని తల్లిదండ్రులు మందలిం చారు. దీంతో జుబేర్‌ మనస్తపానికి గురై మంగళవారం తెల్లవారుజామున గ్రామంలోని చిన్న మసీదులోని బాతురూంలో ఉరివేసుకోని ఆత్మహత్య చేసుకునాడని ఎస్‌ఐ తెలిపారు. జుబేర్‌ మృతిదేహని పోస్టుమార్టు నిమిత్తం నందికొట్కూరు ప్రభుత్వ వైద్యాశాలకు తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తునట్లు ఎస్‌ఐ తెలిపారు.