May 09,2023 00:41

ప్రజాశక్తి - ప్రత్తిపాడు : వ్యసనాలకు బానిసైన యువకుడు తన తండ్రిని డబ్బుల కోసం ఇబ్బంది పెట్టి.. తండ్రి ఆస్పత్రికి వెళ్లివచ్చేలోపే ఆత్మహత్య చేసుకున్నాడు. నియోజకవర్గ కేంద్రమైన ప్రత్తిపాడులో సోమవారం వెలుగు చూసిన ఘటనపై ఎస్‌ఐ రవీంద్ర వివరాల ప్రకారం.. ప్రత్తిపాడుకు చెందిన ఎస్‌కె మహబూబ్‌ సుభానికి కుమార్తెతోపాటు బాజీ (19) అనే కుమారుడున్నాడు. బాజీ చెడు వ్యసనాలకు అలవాటు పడి డబ్బు కోసం ఇంట్లో గొడవ చేస్తుంటాడు. డబ్బులు ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తుంటాడు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నమూ డబ్బుకోసం తండ్రితో గొడవ పెట్టుకున్నాడు. స్నేహితులు సర్దిచెప్పి తీసుకెళ్లగా రాత్రి మళ్లీ గొడవకు దిగాడు. దీంతో తండ్రికి గుండె దడ రావడంతో కుమార్తెను తీసుకుని రాష్ట్ర 10.30 గంటలకు స్థానిక ప్రభుత్వాస్పత్రికి వెళ్లారు. అరగంట తర్వాత వారు ఇంటికొచ్చే సరికి ఇంట్లోని ఫ్యాన్‌కు బాజీ ఉరేసుకుని ఉన్నాడు. వెంటనే చుట్టుపక్కల వారి సాయంతో కిందికి దించి దగ్గర్లోని ఆర్‌ఎంపి వద్దకు తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిజిహెచ్‌కు తరలించారు.