కడప అర్బన్ : రాష్ట్ర ఉర్దూ టీచర్స్ అసోసియేషన్, (రూట) జిల్లాశాఖ ఆధ్వర్యంలో ఉద్యోగోన్నతి ఉపాధ్యాయులు ఇర్షాద్ అహ్మద్, సయ్యద్ ఇక్బాల్, అబుల్ వఫా మస్తాన్ వలీ, షాహిదుల్లాను రూట వ్యవస్థాపక అధ్యక్షులు సయ్యద్ హిదాయతుల్లా ఘనంగా సత్కరించారు. సోమవారం సంఘ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సయ్యద్ హిదాయతుల్లా మాట్లాడుతూ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడానికి అహర్నిశలు కషి చేయాలని సన్మాన గ్రహీతలకు కోరారు. కార్యక్రమంలో రూట రాష్ట్ర నాయకులు డాక్టర్ వసీవుల్లా సాహెబ్, సత్తార్ ఫైజి, ముహమ్మద్ అయ్యూబ్, షహాబుద్దిన్, జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ముహమ్మద్ ఇర్షాద్, జాకీర్ హుస్సేన్, ఎస్‌టియు రాష్ట్ర కార్యదర్శి ఇలియాస్ బాషా, జిల్లా ఆర్థిక కార్యదర్శి మహబూబ్ బాషా, నాయకులుపాల్గొన్నారు.










