Sep 03,2023 21:33

ఉర్దూ డిఐ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి : రుట

రాయచోటి టౌన్‌ : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉర్దూ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ స్కూల్స్‌ (ఉర్దూడిఐ) పోస్టులను వెంటనే భర్తీ చేయాలని రాష్ట్ర ఉర్దూ టీచర్స్‌ అసోసియేషన్‌, రాష్ట్ర సమన్వయకర్త ముహమ్మద్‌ అయ్యుబ్‌,రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షులు ముహమ్మద్‌ అలీ లు డిమాండ్‌ చేశారు. ఆదివారం అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి సబాతుర్‌ రెహమాన్‌ ఆధ్వర్యంలో రూట ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వందల సంఖ్యలో ఎంఇఒ పోస్టులు భర్తీ చేసిన రాష్ట్ర విద్యాశాఖ ఉర్దూ డిఐ పోస్టులు భర్తీని విస్మరించడం శోచనియమని, రాష్ట్ర రెండో అధికార భాష అయిన ఉర్దూకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలోని పాత జిల్లాల్లో ఉర్దూ డిఐ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అదే విధంగా కొత్తగా ఏర్పాటు చేసిన ఎన్‌టిఆర్‌్‌, అన్నమయ్య, శ్రీసత్యసాయి, నంద్యాల, పల్నాడు, తిరుపతి, కోనసీమ జిల్లాలకు ఉర్దూ డీఐ పోస్టులు మంజూరు చేసి భర్తీ చేయాలని, ఈ జిల్లాల్లో ఉర్దూ మీడియం పాఠశాలలు అత్యధికసంఖ్యలో ఉన్న కారణంగా ఉర్దూ డిఐ పోస్టులు అవసరం ఉందని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి అసదుల్లా, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి జాఫరుద్దీన్‌, రాష్ట్ర కార్యదర్శి హుమాయుద్దీన్‌ , జిల్లా బాధ్యులు ముహిబుల్లా, నాయకులు అంజద్‌ బాషా పాల్గొన్నారు.సమావేశంలో మాట్లాడుతున్న రుట నాయకులు