ఎన్నికైన నూతన కార్యవర్గం
ప్రజాశక్తి - హాలహార్వి
ఉప్పరల అభివృద్ధి కోసం అందరూ ఏకం కావాలని నాయకులు కోరారు. శుక్రవారం మండలంలోని చింతకుంట గ్రామంలో ఉప్పర సంఘం నూతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఉప్పర గ్రామం సంఘం సభ్యులు, మహిళలు భగీరథ చిత్రపటాన్ని డప్పు, మేళాలతో ఊరేగించారు. ఆదోని ఉప్పర సంఘం అధ్యక్షులు గోనబావి గోపాల్, ఆదోని నాయకులు మల్లికార్జున, సోమశేఖర్, బళ్లారి ఉప్పర సంఘం ఎర్రిస్వామి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.
నూతన కార్యవర్గం ఎన్నిక
ఉప్పర సంఘం ప్రెసిడెంట్‌గా యు.శేఖర్, వైస్ ప్రెసిడెంట్‌గా లాల్‌స్వామి, సెక్రటరీగా యు.శేషాద్రి, ట్రెజరర్‌గా యు.రంగప్ప, గౌరవాధ్యక్షులుగా యు.శ్రీనివాసులు, గౌరవ సలహాదారులుగా యు.హనుమంతు, యు.శేఖర్, యు.సురేంద్ర, యు.రంగస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.










