ఎండలో ఖోఖో క్రీడాకారుల అవస్థలు
ప్రజాశక్తి- బంగారుపాళ్యం: జిల్లా స్థాయి ఖోఖో క్రీడాపోటీలు ఆదివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడామైదనాంలో నిర్వహించారు. అంతకు మందు క్రీడావందనం ర్యాలీ నిర్వహించి మైదనాంలో దాదాపు రెండు గంటల సేపు ఎండలోనే క్రీడాకాలను కూర్చోబెట్టి అధికారులు, ప్రజాప్రతినిధులు ఉపన్యాసాలు సాగించారు. ఎండకు తట్టుకోలేక క్రీడాకారులు సొమసిల్లి పడిపోతున్నా వారు మాత్రం ఉపన్యాసాలు మాత్రం ఆపే పరిస్థితి లేదని స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు. కనీసం క్రీడాకారులకు అవసరమైన నీడ, నీరు వంటి మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయకపోవడం దారుణమన్నారు.
యువత క్రీడల్లో రాణించాలి: ఎంపీపీ
యువత క్రీడల్లో రాణించాలని ఎంపీపీ అమరావతి అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 67వ ఖోఖో జిల్లాస్థాయి పోటీలు డిఎస్‌ఓ బాలాజీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎంపీపీ అమరావతి మాట్లాడుతూ అండర్-14లో యువతీ యువకులను ప్రోత్సహించాలని, రాష్ట్రంలోని 13 జిల్లాలలో క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. క్రీడల్లో రాణించిన వారు భవిష్యత్తులో ఉత్తమ స్థానానికి చేరుకుంటారని ఆకాక్షించారు. జడ్పిటిసి సోమశేఖర్, ఎంఈఓ నాగేశ్వరరావు, క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.