Mar 16,2023 00:08

పందిరి రాట వేస్తున్న గ్రామ పెద్దలు

ప్రజాశక్తి-నక్కపల్లి:మండలంలోని ఉపమాక మెరకవీధి రామాలయం వద్ద బుధవారం ఉదయం గ్రామ పెద్దలు ఈనెల 30న శ్రీరామనవమి వేడుక సందర్భంగా పందిరి రాట వేశారు. ఈ నెల 30న జరిగే శ్రీరామనవమి వేడుక సందర్భంగా 23 గురువారం ఉదయం 6 గంటల నుండి 30 వ తేదీ గురువారం ఉదయం 6 గంటల వరకు గ్రామ ప్రజల సహకారంతో, శ్రీనివాస భక్త సమాజం ఆధ్వర్యంలో సప్తాహం ( 7 రోజులపాటు భజన కార్యక్రమం ) నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. 30న సీతారాముల కళ్యాణ మహౌత్సవం అనంతరం మధ్యాహ్నం ఆలయం వద్ద అన్న సమారాధన నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు సిద్దాబత్తుల కృష్ణ, కొప్పిశెట్టి రమణ, చెరుకూరి వెంకటేశ్వరరావు, గరగ సూర్యనారాయణ, ప్రగడ వీరబాబు, కొప్పిశెట్టి జగదీశ్వరరావు, గోర్స శ్రీనివాస్‌, జోగేశ్వరరావు, తోలేటి శ్రీనివాస్‌, బద్ది హరిబాబు, తోట అప్పారావు, నాగేశ్వరరావు, పలువురు మహిళలు పాల్గొన్నారు.