Oct 13,2023 22:14

ఉపకార వేతనాలిస్తున్న వెంకయ్య

ప్రజాశక్తి - ఎడ్యుకేషన్‌ : ప్రపంచీ కరణతో దేశదే శాల మధ్య వాణిజ్యం పెరిగిందని, దేశ ప్రగతికి రహదారులు వెన్నెముక అని గుర్తించి ప్రాథమిక, మౌలికరంగం అనదగిన రవాణారంగానికి మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు పునాది వేయగా, మాజీ ప్రధాని వాజ్‌ పేయి హయాంలో రవాణా వ్యవస్థ విస్తరించిందని భారత 13వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. శుక్రవారం విజయవాడలో కష్ణాడిస్ట్రిక్ట్‌ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ హాలులో ది కష్ణా డిస్ట్రిక్ట్‌ లారీ ఓనర్స్‌ ఫౌండేషన్‌ నిర్వహించిన ఉపకార వేతనాలు (స్కాలర్‌ షిప్స్‌) పంపిణీ కార్యక్రమంలో వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ బిజెపి ఏలుబడిలో జాతీయ రహదారుల రూపురేఖలు మారిపోయాయని, రోడ్డు, రైలు, ఇంటర్నెట్‌ కనెక్టివిటీ ఊపందుకుని దేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పు లు వచ్చాయన్నారు. రాష్ట్ర మాజీమంత్రి కామినేని శ్రీనివాస్‌, లైలా గ్రూప్‌ అధినేత గోకరాజు గంగరాజు, ఫౌండేషన్‌ మాజీ అధ్యక్షులు పిఎస్వి ప్రసాదరావు, ఆంధ్రప్రదేశ్‌ లారీ ఓనర్స్‌ అసోసి యేషన్‌ ప్రధాన కార్యదర్శి వై వి ఈశ్వరరావు, ఫౌండేషన్‌ కార్యదర్శి కుర్ర సాయిరాం పాల్గొన్నారు.