కలకడ : మండలంలోని ముడియంవారిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయురాలు నాగలక్ష్మమ్మ పనితీరు సరిగ్గా లేదని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం డిఇఒ శ్రీరామ్‌పురుషోత్తమ్ పాఠశాలను పరిశీలించారు. ఉపాధ్యాయురాలు ప్రవర్తన గురించి విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులతో అడిగి తెలుసు కున్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు ఉపాధ్యాయురాలు పనితీరు సరిగ్గా లేదని విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవరిస్తూ, అసభ్య పదజాలంతో దూషిస్తూ భయబ్రాంతులకు గురిచేస్తోందని ఆరోపించారు. ఆమె ఈ పాఠశాలల్లోనే విధులు చేపడితే తమ పిల్లలను వేరే పాఠశాలకు చేర్పిస్తామని, టిసిలు ఇవ్వాలని కోరారు. స్పందించిన డిఇఒ ఈ విషయాన్ని ఉన్నతా ధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. అనంతరం పాఠశాలలో రికార్డులను పరిశీలించి, మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఎంఇఒ మనీంద్రనాయక్, సిఆర్‌పిలు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.










