Jun 21,2023 20:53

ఆ ఉపాధ్యాయురాలు మాకోద్దు..!

పాఠశాలకు తాళాలు వేసి తల్లిదండ్రుల నిరసన
ప్రజాశక్తి- కలకడ
ఆ ఉపాధ్యాయురాలు మాకొద్దంటూ గ్రామస్తులు మూకమ్మడిగా తిరుగుబాటు చేసిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని ముడియంవారిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఎస్‌జిటి ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న నాగలక్ష్మమ్మ విద్యార్థులను నిత్యం దూషించడం, కొడుతుండటంతో గ్రామస్తులు గతంలో డిఇఒకు ఫిర్యాదు చేయడంతో ఆమెను సస్పెండ్‌ చేసిన విషయం విధితమే. సస్పెన్షన్‌ పూర్తయిన తర్వాత తిరిగి ఇదే పాఠశాలలో విధులకు హజరవడంతో ్గగ్రామ స్తులు ఆగ్రహించి పాఠశాల గేటుకు తాళం వేసి నిరసన చేపట్టారు. విష యం తెలుసుకున్న ఎంఇఒ మునీంద్రనాయక్‌ పాఠశాలకు వెళ్లి పరిస్థితిని పరిశీలించి విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. ఆ ఉపాధ్యాయురాలు మా పాఠశాలకు వద్దని, వేరే పాఠశాలకు బదిలీ చేయమని ఫిర్యాదు చేశారు. ఎంఇఒ స్పందించి మీ ఫిర్యాదును ఉన్నతాధికారులు పంపిస్తామని, వారి ఆదేశాల మేరకు చర్యలు చేపడ తామని హామీనివ్వడంతో తల్లిదండ్రులు ఆందోళనను విరమించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ శాంతమ్మ, విద్య కమిటీ చైర్మన్‌ వెంకటరమణారెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.పాఠశాల గేటుకు తాళం వేసి నిరసన తెలుపుతున్న విద్యార్థు తల్లిదండ్రులు