Nov 05,2023 22:01

ప్రజాశక్తి - ఉండ్రాజవరం ప్రభుత్వ ఉపాధ్యాయులపై యా ప్‌ల భారం తగ్గించాలని ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ డిమాండ్‌ చేశారు. యుటిఎఫ్‌ మండల శాఖ సమావేశం ఎంపిపి పాఠశాలలో జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగం పట్ల ప్రభుత్వ తీరు దారుణంగా ఉందన్నారు. వివిధ రకాల యాప్‌లతో ప్రభుత్వ ఉపాధ్యాయులపై భారాన్ని పెంచుతూ పనికిమాలిన, గాడిద చాకిరి పనులను రుద్దుతుందని విమర్శంచారు. కుటుంబ సంక్షేమ పథకానికి అర్హులైన 50 మంది ఉపాధ్యాయులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు జయకర్‌, జిల్లా అసోసియేట్‌ కార్యదర్శి ఐ. రాంబాబు, కార్యదర్శి వివి.రమణ, ఉండ్రాజవరం మండలం అధ్యక్షులు కె.వెంకటరత్నం, సెక్రటరీ డి.రామారావు, మండల గౌరవ అధ్యక్షులు ఎస్‌ లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ నూతన కమిటీని, కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కుటుంబ సంక్షేమం పథకం డైరెక్టర్‌గా ఆర్‌ఎస్‌ఆర్‌. ఫణి ఎన్నికయ్యారు.