Oct 12,2023 20:46

సమావేశంలో మాట్లాడుతున్న యుటిఎఫ్‌ జిల్లా గౌరవాధ్యక్షులు భాస్కరరావు

ప్రజాశక్తి - భామిని :  ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం ఉదాసీన వైఖరి సరికాదని, ఇంత వరకు ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించకపోవడం సరికాదని యుటిఎఫ్‌ జిల్లా గౌరవాధ్యక్షులు ఆరిక భాస్కరరావు అన్నారు. యుటిఎఫ్‌ స్వర్ణోత్సవాల్లో భాగంగా మండల కౌన్సిల్‌ సమావేశం మండల అధ్యక్షులు ఈగల తిరుపతి రావు అధ్యక్షతన మండలంలోని బాలేరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో గురువారం జరిగింది. ఈ సందర్భంగా భాస్కరరావు మాట్లాడుతూ యాప్‌లతో ఉపాధ్యాయులకు తలకుమించి భారమైందని, తద్వారా బోధనపై దృష్టి పెట్టలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వారం రోజుల్లో సిపిఎస్‌ రద్దు చేయకపోగా, బలవంతంగా జిపిఎస్‌ విధానాన్ని తీసుకు రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని రాష్ట్ర కౌన్సిలర్‌ దండు ప్రకాశరావు తెలిపారు. సెప్టెంబరు నెల జీతంతో డిఎ ఇస్తానని ప్రకటించిన ముఖ్యమంత్రి హామీకే విలులేకండా పోయిందని జిల్లా కార్యదర్శి కె.కృష్ణారావు అన్నారు. అనంతరం కార్యదర్శి నివేదికను మండల ప్రధాన కార్యదర్శి కె.ప్రసాద్‌, ఆర్థిక నివేదికను కోశాధికారి బి.మహేష్‌, ఆడిట్‌ నివేదికను టి.గణపతి ప్రవేశ పెట్టారు. అనంతరం మండలం నూతన కమిటీ ఎన్నిక నిర్వహించారు. జిల్లా కార్యదర్శి కె.కృష్ణారావు ఎన్నికల అధికారిగా, జిల్లా గౌరవ అధ్యక్షులు అరిక భాస్కరరావు పరిశీలకులుగా వ్యవహారించారు. మండల అధ్యక్షులుగా ఈగల తిరుపతిరావు, ప్రధానకార్యదర్శిగా కె.ప్రసాద్‌, గౌరవ అధ్యక్షులు బి.చిన్నారావు, సహాధ్యక్షులుగా పి.తిరుపతి రావు, టి.సుధారాణి, కోశాధికారిగా బి.మహేష్‌, ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌గా బి.మురళీధర్‌, అకడమిక్‌ కమిటీ కన్వీనర్‌గా ఎస్‌.నాగరాజు, కార్యదర్శులుగా ఆర్‌.జ్యోతి, టి.సుందరమ్మ, బాలాదుర్గాప్రసాద్‌, ఎల్‌.సత్యనారాయణ, టి.గురునాధరావు, బి.అప్పలనాయుడు, ఎల్‌.గణేష్‌, కె.వెంకటరమణ, పి.రాజశేఖర్‌ ఎన్నికయ్యారు. అలాగే జిల్లా కౌన్సిలర్లుగా సిహెచ్‌.మార్కో, పి.లుడతాచిన్‌, కె.క్రాంతికుమార్‌, శివ్వాల చంద్రశేఖర్‌, టి.సరోజనమ్మను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
వీరఘట్టం నూతన కార్యవర్గం ఎన్నిక
వీరఘట్టం : స్థానిక రెగ్యులర్‌ పాఠశాలలో గురువారం ఎన్నికల పరిశీలకులు ఎన్నికల అధికారి యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి ఎం.పైడ్రాజు ఆధ్వర్యంలో మండల శాఖ నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. గౌరవ అధ్యక్షులు ఎ.స్వామిబాబు, అధ్యక్షులుగా బి.దుర్గాప్రసాద్‌, కార్యదర్శి కె.గోవిందరావు, సహాధ్యక్షులు జెవి సూర్యప్రకాష్‌, కోశాధికారి బి .వాసుదేవరావు, సహాధ్యక్షులు ఎస్‌.విశాలాక్షిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే కౌన్సిలర్లుగా ఎస్‌.సతీష్‌, వి.రవికుమార్‌, వి.శ్రీధర్‌, ఎ.చంద్రమోహన్‌ నాగరాజు, బి.రాజేశ్వరి, వై.రాజు, వి.అన్నాజీరావు ఎన్నికయ్యారు. వీరితో పాటు మండల కార్యదర్శులు వి.వీర్రాజు, ఎస్‌ కాంతారావు, బి రాజేష్‌, కె.గోవిందరావు, సింహాచలం, ఎం.రవికుమార్‌, వి.ప్రసాద్‌, వి.రాంబాబుల ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్ష ,కార్యదర్శి బి దుర్గాప్రసాద్‌ కె గోవిందరావు మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించేందుకు తమ వంతు కషి చేస్తామని హామీ ఇచ్చారు.