- ఇన్‌ఛార్జి జెసికి ఎపి జెఎసి జిల్లా సంఘం, వివిధ సంఘాల నాయకుల అర్జీ
ప్రజాశక్తి - కాకినాడ
ఎపి జెఎసి అమరావతి మూడవ దశ ఉద్యమ కార్యాచరణలో భాగంగా లోగడ ఉపాధ్యాయులపై పెట్టిన అక్రమ కేసులు, సస్పెన్షన్‌లు ఎత్తివేయాలని, కక్ష సాధింపు ధోరణి మానుకోవాలని కోరుతూ కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో కాకినాడ ఇన్‌ఛార్జి జెసీ ఆర్ మహేష్‌కుమార్‌కు ఎపి జెఎసి అమరావతి జిల్లా చైర్మన్ పి త్రినాధరావు వివిధ సంఘాల నాయకులతో కలిసి అర్జీ అందజేశారు. అనంతరం ఆయన మాట్లా డుతూ ప్రాంతీయ సదస్సుల నిర్వహణ, ఈ నెల 12 వ తేదీ నుండి 19 వ తేదీవరకు జిల్లాలో గల శాసన సభ్యులను, పార్లమెంటు సభ్యులను కలసి సగటు ఉద్యోగి ఆక్రందన లిఖిత పూర్వకంగా తెలియపర్చి సహాయ సహకారాలు కోరతామన్నారు. ఎపి జెఎసి అమరావతి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 30వ తేదీన ఒక రోజు కాకినాడ ధర్నా చౌక్ వద్ద నిరాహారదీక్ష నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమములో జెఎసి అమరావతి కాకినాడ జిల్లా జనరల్ కార్యదర్శి ఎన్‌వి ఎస్‌ఎస్‌ఆర్‌కె దుర్గాప్రసాద్, కోశాధికారి పి.పుల్లయ్య, గెజిటెడ్ హెడ్మాస్టర్ల సంఘం జిల్లా అధ్యక్షులు సిహెచ్ రవి, విఆర్‌ఒ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిన్నా, విశ్రాంత ఉద్యోగుల జిల్లా అధ్యక్షులు పద్మనాభం, విశ్రాంత ఉద్యోగ నాయకులు ఇస్మాయిల్, రాంబాబు, ఉద్యయభాస్కర్, రెవెన్యూ సంఘ నాయకులు, చంద్రశేఖర రెడ్డి, శివ, విజరు, క్లాస్ ఫోర్ సంఘ నాయకులు గిరి, రామకృష్ణ, టెకి శ్రీను పాల్గొన్నారు.
స్పందనలో ఇన్చార్జి జెసి మహేష్ కుమార్‌కు అర్జీని సమర్పిస్తున్న ఎపి జెఎసి అమరావతి సంఘం జిల్లా నాయకులు










