Jun 18,2023 00:34

అనంతగిరిలో ఉన్న జగనన్న కిట్లు

ప్రజాశక్తి -అనంతగిరి:విద్యా సంవత్సరంలో విద్యార్థినీ విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న జగనన్న కిట్లు పాఠ్య పుస్తకాలు పంపిణిలో ఉపాధ్యాయులకు పని భారం పడింది. మండలంలోని 24 పంచాయతీ పరిధిలో 175 ప్రాథమిక పాఠశాలలు, 12 ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలలు, కస్తూర్బా గాంధీ, గురుకులం జూనియర్‌ కళాశాలు 15 ఉన్నాయి. పాఠశాలలు పున:ప్రారంభం నుండి ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మండల కేంద్రంలో ఉన్న బాలికల పాఠశాల 1లో ఉన్న జగనన్న కిట్లలో భాగంగా బ్యాగులు, బూట్లు, షర్ట్‌ ఫీసులు తీసుకుంటున్నారు.
ఆ తర్వాత చిలుకలగెడ్డ స్కూల్‌ కాంప్లెక్స్‌ నుండి 3 తరగతి నుండి 10వ తరగతికు సంబంధించిన పాఠ్య పుస్తకాలు తీసుకుంటున్నారు. జీనబాడు, పెదకొట, పినకొట పంచాయతీ గ్రామాల పాఠశాలల ఉపాద్యాయులు మండల కేంద్రంకు వెళ్లి తీసుకోవాలంటే దేవరాపల్లి మీదుగా విజయనగరం జిల్లా ఎస్‌.కోట నుండి మండలకేంద్రం చేరాలంటే రానుపోను 180 కిల్లో మీటర్లు దూరం ఉంటుంది. ఇటు రోంపలి, పైనంపాడు పాఠశాలలకు సంబంధించిన ఉపాద్యాయులు వెళ్లాలంటే రానుపోను 100 కిల్లో మీటర్లు దూరం ఉంటుంది. ఈ విధంగా టీచర్లు పలు ఇబ్బందులు పడుతున్నారు. మండల విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు కిటు,. పాఠ్య పుస్తకాలు. తమ తమ పాఠశాలలకు తరలించే పనిలో మారుమూల పాఠశాలల ఉపాధ్యాయులు పడ్డారు. జగనన్న కిట్టులో భాగంగా ఒకరోజు. పుస్తకాలు, మరొక రోజు బూట్లను సరఫరా చేస్తుండటంతో ఉపాధ్యాయులు విద్యాశాఖ అధికారులపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చే వస్తువులు కూడా మండల కేంద్రంలో అందుబాటులో ఉంచి ఇవ్వలేదన్నారు. కొన్ని వస్తువులు వస్తువులు అనంతగిరి, మరికొన్ని చిలగలగెడ్డలో తీసు కోవాలని తిప్పుతున్నారని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పాఠశాల గ్రాంటు గత రెండు సంవత్సరాల నుండి మంజూరు చేయలేదని, తమ చేతి డబ్బులతోనే పాఠశాల నిర్వహణ చేపడుతున్నామని ఉపాధ్యాయులు వాపోయారు.
జగన్నన కిట్లు, పాఠ్యపుస్తకాల సరఫరాలో ప్రభుత్వం ఎటువంటి అనుమతులు జారీ చేయలేదని, అందుకే సంబంధించిన పాఠశాలల ప్రధాన ఉపాద్యాయులు వారి వారి పాఠశాలలకు మండల కేంద్రం నుండి తెస్తున్నారని ఎంఇఒ. ఎల్‌ బి.వెంకటరావు పేర్కొన్నారు.