ప్రజాశక్తి - కాకినాడ
ఉపాధ్యాయులను నియమించాలని ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కాకినాడ శ్రీనగర్‌లో గల ఎఎఫ్‌సి పాఠశాల విద్యార్థులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎం.గంగా సూరిబాబు, జిల్లా సహాయ కార్యదర్శి దినేష్‌కుమార్ మాట్లాడారు. గురువు లేని విద్య గుడ్డి విద్య అని విమర్శించారు. పాఠశాల ప్రారంభమై రెండు నెలలైనా ఇప్పటివరకు ఒక్క పాఠం కూడా జరగకపోవడం దారుణమన్నారు. విద్యలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చానని అంటున్న రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలో ఉపాధ్యాయులను ఎందుకు నియమించ ట్లేదని ప్రశ్నించారు. పాఠశాలలో కనీస వసతులు కల్పించాల న్నారు. మరుగుదొడ్లు శుభ్రం చేయించాలని డిమాండ్ చేశారు. మరో రెండు రోజుల్లో ఉపాధ్యాయులను నియమించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సాహిత్, వాసు, రవితేజ, దినేష్, శాత్విక్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.










