Jun 18,2023 00:49

నినాదాలు చేస్తున్న గిరిజనులు, పిల్లలు

ప్రజాశక్తి-రోలుగుంట:తమ గ్రామాల్లో ఉపాధ్యాయులను నియమించాలని రోలుగుంట మండలం ఆర్ల పంచాయతీ పెద్దగరువు, పిత్రిగడ్డ, లోసింగి, పాతలోసింగి ఆదివాసి గిరిజనులు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు కె.గోవిందరావు మాట్లాడుతూ, రోలుగుంట మండలం ఆర్ల పంచాయతీ పిత్రిగడ్డ, పెద్దగరువు, పాతలోసింగి, లోసింగిలో పిటిజి కోందుకు చెందిన వారు కొండల మధ్యలో జీవనం సాగిస్తున్నారన్నారు.. పంచాయతీ కేంద్రంకు రావాలంటే ఎనిమిది కిలోమీటర్లు కొండలో గుట్టలో దాటుకొని రావాల్సి ఉందన్నారు. చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ, జిల్లా కలెక్టర్‌ స్పందించి ఉపాధ్యాయులను ఏర్పాటు చేసి, సొంతంగా స్కూలు నిర్మాణం చేస్తామని చెప్పినా అమలు కాలేదన్నారు.ఉచిత ప్రాథమిక హక్కుగా రాజ్యాంగంలో సెక్షన్‌21(ఎ) రూపొందించినా ఆదివాసి గిరిజన గ్రామాలకు అమలు కాలేదన్నారు. ప్రాథమిక విద్య అభ్యసించడానికి8 కిలోమీటర్‌ దూరం వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు. చట్టానికి వ్యతిరేకంగా ఎనిమిది కిలోమీటర్ల దూరంలో స్కూల్‌కి వెళ్లే పరిస్థితిని తీసుకొస్తున్నారన్నారు. ఆర్టికల్‌ 21 ఏ ప్రకారం ఆదివాసి ప్రాంతంలోనే 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాలు పైబడి విద్యార్థులకు ఒక కిలోమీటర్‌ పరిధిలోనే విద్య అందించాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కిలో నరసయ్య, ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె.మహేష్‌ తల్లిదండ్రులు పాల్గొన్నారు.