ప్రజాశక్తి - కొయ్యలగూడెం
మండలంలోని కుంతలగూడెం ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు రాయపూడి వెంకటరమణ, గంగన్నగూడెం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు బిబివి.రావు ఇరువురు తూర్పుగోదావరి జిల్లాలో స్పందన ఈద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ట్రెండ్ సత్కారాలను అందుకున్నారు. సమాజంలో విద్యార్థుల్లో, యువతలో పెట్రేగిపోతున్న నిరాశ నిస్పృహలు, ఆత్మహత్య ఆలోచనల నుంచి రక్షించే యోచనలో సామాజిక బాధ్యతను స్పందన ఈద ఇంటర్నేషనల్ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో అంకితభావం కలిగిన ఉబోధనా రంగంలో విశేషా అనుభవం కలిగిన ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన వంద మంది ఉపాధ్యాయులను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఇందులో తాము కూడా ఉన్నామని, స్వచ్ఛందంగా యువతకు, విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉంటుందని వెంకటరమణ, బిబివి.రావు తెలిపారు. ఫౌండేషన్ సభ్యులు శామ్యూల్ రెడ్డి, సెంట్రల్ జైలు అధికారి ఎస్.రాజారావు, మాజీ ఎంఎల్‌సి నల్లమల్లి శేషారెడ్డి వారిని సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు వారిని అభినందించారు.










