Sep 24,2023 01:44

ప్రజాశక్తి  - మార్టూరు రూరల్
ఉపాధ్యాయ వృత్తిలో ఉత్తమ ప్రతిభ కనపరిచి పాఠశాల విద్యార్థులను అత్యుత్తమంగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయుల సేవలు అభినందనీయమని ఎంఇఒ సిహెచ్ వస్రాం నాయక్ అన్నారు. జొన్నతాళి పాఠశాలలో గత 6 సంవత్సరాలుగా విధులు నిర్వహించి ఇటీవల బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులు గోపాల్ నాయక్, మస్తానరావు, ఆసియా బేగం, సుజాతను శనివారం ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కె ప్రేమలత, సిఆర్పి జి రమేష్, నాగేశ్వరరావు పాల్గొన్నారు.