Sep 06,2023 23:54

ఉపాధ్యాయులకు సన్మానం

ప్రజశక్తి - చీరాల : చీరాల పట్టణంలోని రోటరీ కమ్యూనిటీ హాలులో బత్తుల సర్వీస్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో బుధవారం గురుపూజోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి చేతుల మీదుగా 15 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ సామాజిక స్పహతో చీరాల ప్రాంతంలో బత్తుల సర్వీస్‌ ట్రస్ట్‌ ద్వారా అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు.ఉత్తమ సేవలందించిన గురువులను సత్కరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు బత్తుల బ్రహ్మారెడ్డి, రాధాకష్ణ, మురళీకష్ణ, సత్యనారాయణ, విజరు కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.