ఉపాధ్యాయులకు సన్మానం
ప్రజాశక్తి-ఉదయగిరి : మండల పరిధిలోని బిజ్జంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తూ బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు పాఠశాలలో సోమవారం ఘనంగా సన్మానం నిర్వహించారు. పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు జి.వెంకటేశ్వర్లు, సిహెచ్.వెంకటకృష్ణారెడ్డి, టి.సృజన, పి.వాణి, కె.శ్రీనివాసులు, కె.మస్తానయ్య, పి ఎండి రఫీ బదిలీపై వెళ్లడంతో బండగానిపల్లి సర్పంచ్ లక్కు రమణమ్మ పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి.వెంకటేశ్వర్లు పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ ఎం.సుందర్ రామిరెడ్డి వారిని ఘనంగా సన్మానించారు. పాఠశాలలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణులైన మొదటి మూడు స్థానాలు సాధించిన విద్యార్థులకు సర్పంచ్ బహుమతులు అందజేశారు. పాఠశాలలో విధులు నిర్వహించి బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులు ప్రతి తరగతికి ఒక కూల్ వాటర్ క్యాన్ ప్లాస్టిక్ స్టూల్ అందజేశారు. పాఠశాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని హామీనిచ్చారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు.










