Oct 02,2023 00:08

నాగేశ్వరరావును సత్కరిస్తున్న ఎంఎల్‌ఎ చిర్ల జగ్గిరెడ్డి

ప్రజాశక్తి - రావులపాలెం, ఆత్రేయపురం
ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఎంఎల్‌ఎ చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. రావులపాలెం జడ్‌పి ఉన్నత పాఠశాలలో ఇంగ్లీషు సహోపాధ్యాయునిగా పనిచేస్తున్న కప్పల నాగేశ్వరరావును సన్మానించారు. ఈ సన్మానానికి యుటిఎఫ్‌ నుంచి నాగేశ్వరరావును ఎంపిక చేసి సన్మానించారు. విద్యార్థులను తీర్చిదిద్దడంలోను, ఉత్తమ బోధన అందించడంలో చేసిన కృషికి ఆయన్ని సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు ఆయనకు అభినందనలు తెలిపారు. అలాగే రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు గ్రహాత కెవి.శేఖర్‌ను ఆత్రేయపురం మండలం ర్యాలీ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. అప్పటి గురువులు కుడిపూడి నాగభూషణం ఆధ్వర్యంలో శేఖర్‌ మాస్టర్‌ దంపతులకు సన్మానం చేశారు, ఈ కార్యక్రమంలో విశ్వజనని బుక్‌ స్టార్‌ యజమాని ఎం.సూరిబాబు, దివ్య రెడీమేడ్స్‌ యజమానులు ఎస్‌.రాంబాబు, ఎస్‌.సతీష్‌, శివరామకృష్ణ, మీరా వలీ, ఎస్‌కె మస్తాన్‌, ఎం.బద్రినారాయణ, కె.శ్రీనివాస్‌, ఝాన్సీ, ఎన్‌.బేబికుమారి తదితరులు పాల్గొన్నారు.