Dec 26,2022 23:20

ప్రజాశక్తి-వన్‌టౌన్‌: విజయవాడ చిల్డ్రన్‌ స్కూల్స్‌ అండ్‌ ట్యుటోరియల్స్‌ అసోసియేషన్‌ ఓబిహెచ్‌ఎ డివిజన్‌ బడ్జెట్‌ పాఠశాలల ఉపాధ్యాయులకు సోమవారం కొత్తపేటలోని కెబిఎన్‌ కాలేజీలో ఉపాధ్యాయ శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌ ప్రెసిడెంట్‌ లయన్‌ డా రాజు డేవిడ్‌ దొంతులూరి సభకు అధ్యక్షత వహించారు. ఫ్యాకల్టీగా విచ్చేసిన ప్రముఖ సైకాలజిస్ట్‌ ప్రత్యూష సుబ్బారావు, భౌతిక శాస్త్ర నిపుణులు యర్రంరెడ్డి గాంధీ చైల్డ్‌ సైకాలజీ మరియు భౌతిక శాస్త్రం మీద తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 150 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనంతరం శిక్షణ పొందిన ఉపాధ్యాయలకు సర్టిఫికెట్స్‌ అందచేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిధిగా గౌరవ అధ్యక్షులు దేవినేని కిషోర్‌ కుమార్‌, విశిష్ట అతిథిగా కెబియన్‌ కాలేజీ వైస్‌ ప్రిన్సిపాల్‌ పిఎల్‌.రమేష్‌ ,గౌరవ అతిథిగా సెంట్రల్‌ కమిటీ అధ్యక్షులు చెన్నారెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి, ఉపాధ్యాయ శిక్షణా తరగతుల చైర్మన్‌ ఆర్‌.బ్రహ్మారెడ్డి, కార్యదర్శి బికె.శిరీష కుమారి, కోశాధికారి ఎస్‌కె. ఖాదర్‌ బాషా తదితరులు పాల్గొన్నారు.