శిక్షణ ఇస్తున్న రిసోర్స్ పర్సన్స్
ప్రజాశక్తి మారేడుమిల్లి : ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు విద్యాశాఖ, సమగ్ర శిక్షా అభియాన్ సంయుక్తంగా నాలుగు రోజుల పాటు నిర్వహించే టీచింగ్ ఎట్ ది రైట్ లెవెల్ శిక్షణా కార్యక్రమం మంగళవారం స్థానిక బాలురు ఆశ్రమ పాఠశాలలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా మండల విద్యాశాఖాధికారి కె.తాతబ్బాయి దొర మాట్లాడుతూ మొదటి విడతలో మండలంలోని 49 మంది ఉపాధ్యాయులకు శిక్షణా ఇవ్వడం జరుగుతుందని, రెండో విడతలో మిగిలిన వారికి ఇస్తామని చెప్పారు. ఈ శిక్షణా కార్యక్రమం ద్వారా బోధన సామర్థం పెంచుకొని విద్యార్థుల అభ్యసన స్థాయిని మెరుగుపర్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్స్ వెంకటేశ్వర్లు, దూడ కమలాకర్, దేవిరెడ్డి, ఎం.జగజీవన్ పాల్గొన్నారు.










