ప్రజాశక్తి - పర్చూరు
మండలంలోని 50శాతం ప్రాధమిక పాఠశాలల ఉపాధ్యాయులకు స్థానిక వైఆర్ ఉన్నత పాఠశాల ఆవరణలో శిక్షణ నిర్వహించారు. సమావేశానికి డిఇఓ పివిజె రామారావు మాట్లాడుతూ ఉపాధ్యాయులు అందరూ టిఎల్‌ఎం ఉపయోగించి బోధన చేయాలని సూచించారు. ప్రాధమిక స్ధాయిలోనే పునాది బాగా ఉంటే విద్యార్ధుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందన్నారు. ప్రభుత్వం డిజిటల్ టెక్నాలజీ అందిస్తున్నదని తెలిపారు. వాటిని ఉపయోగించి బోధన చేయాలని సూచించారు. ఉపాధ్యాయులు సమయపాలన ఖచ్చితంగా పాటించాని అన్నారు. కార్యక్రమంలో ఎంఇఒ ఎంఇ సత్యనారాయణ, పి వెంకటనారాయణ, హెచ్‌ఎం ఇ రాజశేఖర్, రిసోర్స్ పర్సన్స్ జి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.










