ప్రజాశక్తి - ఇంకొల్లు రూరల్
అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సంధర్భంగా మండలంలోని గంగవరం శ్రీ వలేటి కృష్ణయ్య ఉన్నత పాఠశాలలోని ఉపాధ్యాయులందరిని రోటరీ క్లబ్ తరపున నేషన్ బిల్డర్స్ అవార్డుతో సత్కరించారు. ఈ సందర్భంగా పాఠశాల పూర్వ విద్యార్ధి, పూసపాడు పాఠశాల రిటైర్డ్ పిఇటి ప్రతిపాటి వెంకటేశ్వర్లు పాఠశాలకు ఆయన ఒక నెల పెన్షన్ రు.50వేలను విరాళంగా అందజేశారు. సభకు పాఠశాల హెచ్‌ఎం కొర్రపాటి వీరాంజనేయులు అధ్యక్షత వహించారు. రోటరీ అధ్యక్షులు కరి కమలేశ్వరరావు, కార్యదర్శి జెట్టి వెంకటేశ్వర్లు (స్వామి), కోశాధికారి చుండి సాంబశివరావు, డైరెక్టర్లు మద్దినేని హనుమంతరావు, సోమేపల్లి రామమోహనరావు, వంకాయలపాటి శ్రీమన్నారాయణ, సర్పంచ్ బెల్లం సుధాకరరావు, ఎంపిటిసి సభ్యులు మేకల రాజగోపాలరెడ్డి, పాఠశాల వ్యవస్థాపక కుటుంబీకులు వలేటి ఆంజనేయులు, పూసపాడు హిందీ పండిట్ వలేటి సుబ్బాయమ్మ, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవ సభకు పాఠశాల హెచ్‌ఎం పిడపర్తి పేరి రెడ్డి అధ్యక్షత వహించారు.










