Jul 12,2023 22:11

ఫొటో : ఉపాధ్యాయులను సన్మానిస్తున్న దృశ్యం

ఉపాధ్యాయులకు ఘన సన్మానం
ప్రజాశక్తి-మర్రిపాడు : స్థానిక ఉన్నత పాఠశాలలో పనిచేసి ఇతర పాఠశాలలకు బదిలీపై వెళ్లిన ప్రధానోపాధ్యాయురాలు శివజ్యోతి, ఉపాధ్యాయులు వెంకటయ్య, పెంచల ప్రసాద్‌, రమేష్‌, రామకృష్ణారెడ్డి, మహమ్మద్‌ రఫీ, సుధాకర్‌, బోధనేతర సిబ్బంది అల్లాభక్షు, మజాహర్‌లను పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మలత మాట్లాడుతూ బదిలీ అయిన ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు ఎంతో నిబద్ధతతో, అంకితభావంతో పనిచేసి విద్యార్థుల, గ్రామస్తుల మన్ననలు పొందారన్నారు.
పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల అభ్యున్నతికి వారు చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఎంఆర్‌జి రాజేంద్రకుమార్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.