ప్రజాశక్తి - ముదినేపల్లి
సెప్టెంబర్ ఐదో తేదిన జరిగే ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురష్కరించుకొని శనివారం ముదినేపల్లి మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఉపాధ్యాయులకు ఆటల పోటీలు నిర్వహించారు. ఉపాద్యాయులకు, ఉపాధ్యాయినిలకు వేర్వేరుగా ఆటలు పోటీలు నిర్వహించారు. ఎంపిడిఒ పి.మల్లీశ్వరి, ఎంఇఒ కె.నరేష్‌కుమార్ ఆధ్వర్యంలో ఈ పోటీలు ఏర్పాటు చేశారు. మగవారికి, ఆడవారికి ఏడు రకాల ఆటలు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఉపాధ్యాయ దినోత్సవం నాడు బహుమతులు అందజేయనున్నట్లు ఎంఇఒ నరేష్‌కుమార్ తెలిపారు.










