Jul 05,2023 21:47

ఫొటో : పాఠశాలలోని మొక్కల పెంపకాన్ని పరిశీలిస్తున్న మండల విద్యాశాఖ అధికారులు

ఉపాధ్యాయులకు అభినందనలు
ప్రజాశక్తి-ఉదయగిరి : ఉదయగిరి ఎంఇఒలు షేక్‌ మస్తాన్‌ వలి, తోట శ్రీనివాసులు జి అయ్యవారిపల్లి ప్రాథమిక పాఠశాలను ఉపాధ్యాయులను అభినందించారు. బుధవారం మండల పరిధిలోని మండల పరిషత్‌ జి అయ్యవారిపల్లి ప్రాథమిక పాఠశాలను వారు తనిఖీ చేశారు. జగనన్న మనబడి నాడు-నేడు ఫేస్‌-1లో జరిగిన పాఠశాల అభివృద్ధిని, పాఠశాల లోపల గ్రీనరీ, చెట్ల పెంపకం బాగుందని ప్రధానోపాధ్యాయులు ఎల్‌ బాబు, ఉపాధ్యాయులు ఎం.ఫణికుమార్‌ను అభినందించారు.
అనంతరం విద్యాశాఖ అధికారులు పాఠశాల విద్యార్థుల తెలుగు, గణిత, ఆంగ్లంలో విద్యార్థుల పఠన అభ్యసన సామర్థ్యాలను నైపుణ్యాలను పరిశీలిస్తూ, తెలుగులో విద్యార్థులు గేయాలను పద్యాలను రాయుక్తంగా పాడే విధంగా చూడాలన్నారు. గణితంలోనే చతుర్విధ ప్రక్రియలలో బాగాహారం, గుణించడంలో విద్యార్థుల సామర్థ్యాలు పెంపొందే విధంగా బోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయుల, విద్యార్థుల, మధ్యాహ్న భోజన కార్మికులు ఆయాల హాజరు పట్టీలను, మధ్యాహ్న భోజన రికార్డులను పరిశీలించారు. పాఠ్య ప్రణాళికలు తయారు చేసుకుని బోధనోపకరణాలతో బోధించాలని సూచించారు.