Sep 03,2023 22:17

గుంటూరు: రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బలోపేతానికి ప్రైవేటు ఉపా ధ్యాయులు, అధ్యాకులు చేస్తున్న కృషి అభినందనీయమని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. రాష్ట్ర సమైఖ్య ప్రైవేటు లెక్చరర్స్‌, టీచర్స్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో స్థానిక ఏసీ కాలేజి సమావేశ మందిరంలో ముందస్తు ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు ప్రైవేటు విద్యా సంస్థల ఉపాధ్యాయులు, అధ్యాపకులకు సన్మానం నిర్వహించారు. ఎమ్మెల్సీ అప్పిరెడ్డి మాట్లాడుతూ దేశంలో ఏరాష్ట్రంలో లేని విధంగా విద్యా అభివృద్ధికి సిఎం జగన్మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. ప్రైవేటు ఉపాధ్యాయులు, అధ్యాపకుల సమస్యలను సిఎం దృష్టికి తీసుకెళతానని చెప్పారు. సభకు అధ్యక్షత వహించిన ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా ప్రైవేటు ఉపాధ్యాయులు, అధ్యాపకులకు గుర్తింపు కార్డులు, హెల్త్‌ కార్డులు, ఈసిఎస్‌, ప్రావిడెంట్‌ ఫండ్‌ వంటివి వచ్చేలా కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా నాలుగు దశాబ్ధాల క్రితం ఉన్నత ప్రభుత్వ ఉద్యోగాన్ని ఒదులుకొని, పాఠశాలను స్థాపించి వేలాది మందిని తీర్చిదిద్దుతున్న డాక్టర్‌ కన్న మాస్టర్‌తోపాటు, 45 మంది ఉపాధ్యాయులు, అధ్యాప కుల్ని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆర్గనైజేషన్‌ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్‌ పి.నాగయ్య, రాష్ట్ర అధ్యక్షులు ఎం.సురేష్‌, ఉపాధ్యక్షులు డి.రమేష్‌, కళాశాలల అర్గనైజేషన్‌ కన్వీనర్‌ కె.గోవిందరాజు, రాష్ట్ర కోఆర్డినేటర్‌ పి.శ్రీనివాసరెడ్డి, జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్‌, జిల్లా గ్రం థాలయ సంస్థ అధ్యక్షులు బత్తుల దేవానంద్‌ పాల్గొన్నారు.