ప్రజాశక్తి-రాజవొమ్మంగి
ఉపాధ్యాయుల సస్పెన్షన్లపై ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం స్థానిక మండల విద్యావనరుల కార్యాలయం వద్ద యుటిఎఫ్ ఆధ్వర్యాన మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ రాజవొమ్మంగి మంగల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.పైడిమల్లు, పి.రమణ మాట్లాడుతూ ఇటీవల పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పాఠశాలల పర్యవేక్షణ సందర్భంగా అధికారులు, ఉపాధ్యాయులను సస్పెన్షన్లకు గురి చేస్తూ దోషులుగా చిత్రీకరించడాన్ని వ్యతిరేకిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేసినట్లు చెప్పారు. 25న నల్ల రిబ్బన్లు ధరించి విధులకు హాజరు కాగా, 26న స్పాట్ కేంద్రాల వద్ద భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమం చేస్తున్నట్లు చెప్పారు. అలాగే పాత తాలూకా కేంద్రాలలో ఆందోళన చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ మండల గౌరవ అధ్యక్షులు సత్యవతి, నాయకులు ఎం రమేష్ బాబు, పీవీ సుబ్బారావు, టీవీఎల్ ప్రసన్న, బి వెంకటలక్ష్మి, ఎన్ రాజబాబు, జి త్రినాథ్, అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.










