ప్రజాశక్తి - అమలాపురం
ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరిం చాలని యుటిఎప్ జిల్లా కమిటీ డిమాండ్ చేశారు. ఈ మేరకు డిఇఒకు సమస్యలను వివరించింది. ఉన్నత చదువుల కోసం అనుమతిని ఇవ్వాలన్నారు. వేసవిలో పదో తరగతి పరీక్షల నిర్వహణలో పాల్గొన్న ఉపాధ్యాయులకు బకాయిలు చెల్లించాల న్నారు. 2023 జనవరిలో తాత్కాలిక ప్రమోషన్స్‌లో పనిచేసిన వారికి రూ.2,500 గౌరవ వేతనం ఇచ్చేందుకు ఉత్తర్వులు ఇవ్వాలలన్నారు. వర్క్ అడ్జస్ట్‌మెంట్ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈనెల 5వ తేదీ వచ్చినా నేటికీ వేతనాలు రాలేదన్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరిం చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్ర మంలో యుటిఎఫ్ గౌరవ అద్యక్షులు సుబ్బారావు, జిల్లా అధ్యక్షులు పి.వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఎస్.జ్యోతిబసు, నాయకులు దుర్గా ప్రసాద్, పెన్నాడ శ్రీనివాసరావు, మురుగేశ్వరరావు కార్యకర్తలు ఏడుకొండలు, రమణ, ప్రదీప్‌కుమార్, ప్రసాద్ ,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.










