ప్రజాశక్తి-హిందూపురం :ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తానని పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని బాల యేసు డిగ్రీ కళాశాలలో ఆదివారం ఏర్పాచేసిన సన్మానసభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం ఎన్నో విన్నూత పథకాలు అమలు చేస్తుందన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఉపాధ్యాయులు సహకారం అందివ్వాలన్నారు. పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం త్వరలోనే చర్యలు తీసుకుంటుందన్నారు. 2008, 1998 డీఎస్సీ ఎంటీఎస్ ఉపాధ్యాయులకు అన్ని విధాలా న్యాయం చేస్తామన్నారు. ఎంటీఎస్ ఉపాధ్యాయుల సమస్యలపై ఈశ్వర్‌రెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్సీకి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఉపాధ్యాయులు ఎమ్మెల్సీని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంఈఓలు నాగరాజు, ఎ.గోపాల్, సాల్మన్‌రాజ్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు విష్ణువర్ధన్‌రెడ్డి, పుల్లారెడ్డి, అశోక్‌కుమార్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, చెన్నారెడ్డి, నాగరాజు, ఈశ్వర్‌రెడ్డి, సుధాకర్, మంజూనాథ్, రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.










