ఉపాధ్యాయుల సేవలు వెలకట్ట లేనివి
ప్రజాశక్తి - గూడూరు టౌన్ : అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జె.వి.వి ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని రిటైర్డ్ ఉద్యోగుల భవనములో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయులు పి.పురుషోత్తమ రావు యస్.చెంచునారాయణ లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గా వియస్‌ఆర్ స్కూల్ కరస్పాండెంట్ బాలకష్ణమరాజు, చిల్లకూరు యంఇఓ రవూఫ్ పాల్గొన్నారు. అనంతరం అతిథుల చేతుల మీదుగా సన్మాన పత్రం, జ్ఞాపికలను అందచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు ఎన్నో సంవత్సరాలుగా విద్యా భోదన చేసి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసి రిటైర్ అయిన తర్వాత కూడా జేవివి ద్వారా సమాజంలో ఉన్న మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ, విద్యార్థులలో సైన్స్ పట్ల అవగాహన కల్పిస్తూ నిరంతరం సేవా కార్యక్రమాలు చేస్తున్న పురుషోత్తమ రావు, చెంచునారాయణ గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొన్నారు. ఈ సన్మానానికి నిజమైన అర్హులు వారేనని వారిని సన్మానించడం తమ అదష్టంగా భావిస్తున్నామని తెలిపారు. సన్మాన గ్రహీతలు ఇద్దరూ అందరికీ కతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేవివి అధ్యక్షులు వేగూరు రాజేంద్రప్రసాద్, గుర్రం విజరు బాబు, యుటియఫ్ నాయకులు సాయికిరణ్, సుధీర్, రవి, రిటైర్డ్ ఉద్యోగులు భాస్కర్, సుబ్రహ్మణ్యం, వెంకటయ్య, యన్‌జిఓ నాయకులు శ్రావణ్, శ్రీను, సుబ్రహ్మణ్యం, అక్కం రమణయ్య, రాధయ్య, ఉపాధ్యాయులు, ఉద్యోగులు సన్మాన గ్రహీతల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.










