Apr 26,2023 20:42

నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులు

ప్రజాశక్తి - ఆదోని
ఉపాధ్యాయుల పట్ల ఎడ్యుకేషన్‌ చీఫ్‌ సెక్రటరీ మొండి వైఖరి తగదని ఫ్యాప్టో నాయకులు తెలిపారు. బుధవారం పట్టణంలోని తహశీల్దార్‌ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సస్పెండ్‌ చేయడం అక్రమమన్నారు. ఉపాధ్యాయులు స్నేహపూర్వక వాతావరణంలో విద్యా వ్యవస్థను నడిపించేందుకు అందరి సహకారంతో ముందుకు వెళ్లాలని కోరారు. ఫ్యాప్టో నాయకులు బి.నాగరాజు, భాస్కర్‌, నాగరాజు, జీవిత, గాదిలింగప్ప, శ్రీనివాసులు, సుంకన్న, రామాంజనేయులు, సుధాకర్‌, రంగన్న, నరసింహులు, మహదేవప్ప, రాఘవేంద్ర, మధు, తిక్కస్వామి, బీరప్ప, ఉరుకుందప్ప, వీరచంద్ర యాదవ్‌, సునీల్‌ రాజ్‌ కుమార్‌, రమేష్‌, రంగనాయకులు, నారాయణ, ఉరుకుందు పాల్గొన్నారు.