Nov 14,2023 23:07

పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ప్రవీణ్‌ కుమార్‌

టెక్కలి: ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తు న్న ఉపాధ్యాయులు ప్రతినెలా హాజరవుతున్న సముదాయాలకు సంబంధించిన పర్యవేక్షణ తప్పనిసరిగా చేపట్టాలని ఎపి సమగ్ర విద్యా బోధన రాష్ట్ర పరిశీలకులు ఎ.ప్రవీణ్‌కుమార్‌ సూచించారు. లిప్‌లో భాగంగా స్థానిక బాలికోన్నత పాఠశాలలో మంగళవారం రండు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో బోధన చేపట్టే ఉపాధ్యాయులు విద్యార్థులకు చదవడంతో పాటు రాయడంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పాఠశాలల సముదాయాల్లో ఉపాధ్యాయులు చర్చించుకునే అంశాలపై పర్యవేక్షణ ఉండాలన్నారు. తరగతి గదిలో ఉపాధ్యాయులు అనుసంధానంగా బోధన చేపట్టాలన్నారు. కోర్సు డైరెక్టర్‌గా టెక్కలి డివిజన్‌ ఉప విద్యాశాఖ అధికారిని గార పగడాలమ్మ, డిఆర్‌పిగా నలినీ కాంతారావు వ్యవహరించారు. కార్యక్రమంలో ఎంఇఒలు దల్లి తులసీరావురెడ్డి, దాసుపురం చిన్నారావు, సవర దేవేందర్రావు, మల్లారెడ్డి పద్మనాభం, డి.చిన్నవాడు, ఎ.చిన్నారావు, డివిజన్‌లోని 16 మండలాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.