
పుట్టపర్తి క్రైమ్ : ఉపాధ్యాయుల పని సర్దుబాటుపై వైఎస్‌ఆర్‌టిఎఫ్ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ మేరకు వారు బుధవారం స్థానిక డీఈవోను కలసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పని సర్దుబాటులో భాగంగా ఏ స్కూల్లోనూ ఉపాధ్యాయుల లోటు లేకుండా చూడాలన్నారు. అదనపు ఉపాధ్యాయులను అవసరమైన పాఠశాలల్లో వారి అభ్యర్థనను తీసుకొని బదిలీ చేయాలన్నారు. అంగవైకల్యం, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వీలైనంత త్వరగా పని సర్దుబాటు ముగించాలని ఉమ్మడి జిల్లా ప్రాతిపదికగా తీసుకొని అదనంగా చూపబడిన వారికి వారి ప్రాధాన్యత ప్రకారం సర్దుబాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్‌టీపీఎఫ్, పిఆర్‌టియు జిల్లా నాయకులు జీవీ రమణారెడ్డి, రజనీకాంత్ రెడ్డి, నబీర్ సాహెబ్, పరంధామ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, కేశవ తదితరులు పాల్గొన్నారు.