Apr 26,2023 00:27

నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులు

ప్రజాశక్తి -అనంతగిరి:రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సిబ్బంది నల్ల బ్యాడ్జిలతో విధులకు హాజరై నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు దేముడు మాట్లాడుతూ, ఉపాధ్యాయులపై ఎటువంటి కారణాలు లేకుండా విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌ ఏకపక్ష నిర్ణయాలతో సస్పెండ్‌ చేయడం సమంజసం కాదన్నారు.అక్రమ సస్పెండ్స్‌ తక్షణమే నిలుపుదల చేయాలని, లేని పక్షాన పోరాటాన్ని ఉదృతం చేస్తామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ మండల ప్రతినిధులు మల్లేశ్వరరావు, ఈశ్వరరావు, శెట్టి. పరమేష్‌, కె.ప్రకాష్‌, కె.రామారావు, జె.సుధారాణి, ఎం.భాను, పి.వనిత, పద్మావతి పాల్గొన్నారు.