కడప అర్బన్ ; ఉద్యోగోన్నతలు, బదిలీల కారణంగా స్థానచలనమైన ఎంఇఒలు-2, పిజిటిలు, భాషాపండితులు, కొంతమంది ఉపాధ్యాయుల జీతాల చెల్లింపునకు తగు చర్యలు తీసుకోవాలని ఎస్టీయు జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు పి.రమణారెడ్డి, జి.చెన్నకేశవరెడ్డి కోరారు. గురువారం కడపలోని వివిఆర్ ఎస్టీయు భవన్ లో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బదిలీలలో కొంతమంది ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వివిధ మండలాలకు ఎంఇఒ-2లుగా, పిజిటిలుగా వెళ్లారని తెలిపారు. వారి జీతాల చెల్లింపులో నెలకొన్న సందిగ్ధతకు తెరదించాలని తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఉండే భాషాపండితులు కూడా పనిసర్దుబాటు కింద బదిలీ చేయ బడ్డారని పేర్కొన్నారు. వారి జీతాల చెల్లింపులో స్పష్టత ఇచ్చి చెల్లిం చాలన్నారు.సమావేశంలో రాష్ట్ర మాజీ ప్రధానకార్యదర్శి మల్లు రఘునాథరెడ్డి, రాష్ట్రకార్యవర్గ సభ్యులు బాలగంగిరెడ్డి, గురు కుమార్, సీనియర్ జిల్లా నాయకులు సురేష్ బాబు, జయ రామయ్య, శంకరయ్య, సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న రమణారెడ్డి
ఎపిటిఎఫ్ ఆధ్వర్యంలో డిఇఒకు వినతి
ఇటీవల నిర్వహించిన బదిలీలు, ఉద్యోగోన్నతుల్లో భాగంగా నూతన పాఠశాలలో చేరిన కొంతమంది ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు కొన్ని కారణాల వల్ల జూన్‌లో వేతనాలు తీసుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. వెంటనే సమస్యను పరిష్కరించి వేతనాలు చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని డిఇఒ రాఘవరెడ్డిని ఎపిటిఎఫ్‌్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ. శ్యాంసుందర్ రెడ్డి కోరారు. గురువారం డిఒకు వినతిపత్రం అందజేశారు. గాంధీనగర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో కలసి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధానకార్యదర్సి నాగరాజు, రాష్ట ఆడిట్ కమిటీ సభ్యుడు కృష్ణారెడ్డి, రాష్టకౌన్సిలర్ ఖాదర్ బాష, జిల్లా ఉపా ధ్యక్షుడు మల్లిఖార్జునరెడ్డి, జిల్లా కౌన్సిలర్ శ్రినివాసులు పాల్గొన్నారు.










