ప్రజాశక్తి-కంచికచర్ల
ఉపాధ్యాయులు బదిలీలు పారదర్శకంగా నిర్వహించాలని యూటీయఫ్ జిల్లా కార్యదర్శి ఎ సుందరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక పెన్షనర్స్ కార్యాలయంలో శనివారం కంచికచర్ల, వీరులపాడు మండలాల యూటీయఫ్ కార్యవర్గ సమావేశం జిల్లా అద్యక్షులు కె శ్రీనివాసరావు అద్యక్షతన జరిగింది. ఈ సమయంలో పాల్గొన్న సుందరయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయులు బదిలీల ప్రక్రియ లో రేషనలైజేషన్ లో జూనియర్స్ తో పాటు సీనియర్లకు ప్రాధాన్యత కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సీపియస్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న డీఏ వెంటనే ఇవ్వాలని, ఉపాధ్యాయులకు ఫేషియల్ హాజరు విధానాన్ని రద్దు చేయాలని, బోధనకు సంబంధించిన బాధ్యత మాత్రమే అప్పగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర నాయకులు సంజీవరెడ్డి మాట్లా డుతూ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై యూటీయఫ్ ఆధ్వర్యంలో పోరాడి సాధించు కోవాలన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కౌన్సిల్ సభ్యుడు డి హరి ప్రసాద్, నాయకులు మహేశ్వర వెంకటేశ్వరరావు, పులి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
నూతన కార్యవర్గం ఎన్నిక : కంచికచర్ల, వీరులపాడు మండలాల యూటీఎఫ్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు నిర్వాహకులు తెలిపారు. కంచికచర్ల మండల అధ్యక్షులు గా జీ వీ గంగాధర్, ప్రధాన కార్యదర్శి గా కె నాగేశ్వర్ రావు, వీరులపాడు మండల శాఖ అధ్యక్షుడు గా కె నాగేశ్వర గుప్తా, ప్రధాన కార్యదర్శి గా కె ప్రభాకర్ ఇతర కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కె ఫణీంద్ర, యం రామారావు, యన్ దుర్గాదేవి, వెంకట్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.










