ఫిర్యాదు చేస్తున్న సిపిఎం నేతలు
ప్రజాశక్తి అనంతగిరి: మండలంలోని సోమవారం జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్‌లో వైసిపి పార్టీకి చెందిన ఉపాధ్యాయుడు ఎన్నికల ఏజెంట్‌గా వెళ్లినందుకు సిపిఎం జెడ్పిటిసి దీసరి. గంగరాజు ఆధ్వర్యాన జాయింట్ కలెక్టర్, తహశిల్దార్‌లకు లిఖిత పూర్వకంగా, ఫోన్‌లో ఫిర్యాదులు చేశారు. అనంతరం స్థానిక విలేకరులతో జెడ్పిటిసి గంగరాజు మాట్లాడుతూ, వైసిపికి చెందిన ఎగుబూడి ఎంపీపీ పాఠశాల ఉపాధ్యాయుడు గుబ్బయి. త్రినాథ్ ఎన్నికల ఏజెంట్‌గా వివరిస్తూ దొంగ ఓట్లను వేయించడం తగదన్నారు. ఉపాధ్యాయుడిని ఉద్యోగ బాధ్యత నుండి పూర్తిగా తొలగించాలన్నారు. ఈ కార్యక్రమంలో టోకూరు సర్పంచ్ కె. మొష్య, గిరిజన సంఘం మండల అధ్యక్షులు ఎస్.నాగులు, కార్యకర్తలు జె.రామన్న పాల్గొన్నారు.










