Jul 19,2023 23:52

ఆందోళన చేపడతున్న విద్యార్థులు, తల్లితండ్రులు

ప్రజాశక్తి -అరకులోయ రూరల్‌:మండలంలోని మారుమూల ఇరగాయి మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు విద్యా సంవత్సరం ప్రారంభం నుండి ఇప్పటివరకు విధులకు హాజరు కాలేదని గ్రామస్తులు తెలిపారు. ఉపాధ్యాయుడు పై చర్యలు తీసుకోవాలని బుధవారం తల్లితండ్రులు, విద్యార్థులు పాఠశాల వద్ద నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ, ఉపాధ్యాయుడే డుమ్మా కొడుతుంటే విద్యార్థులు ఎలా చదువుకుంటారని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్‌, అధికారులకు స్పందనలో ఫిర్యాదు చేశామని తెలిపారు. స్పందనలో ఫిర్యాదు అనంతరం ఉపాధ్యాయుడుపై చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చినప్పటికీ నేటికీ చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. అధికారులు స్పందించి తక్షణమే ఉపాధ్యయుడుపై చర్యలు తీసుకొని వేరొకరిని నియమించాలని డిమాండ్‌ చేశారు.