Feb 04,2023 00:25

మాట్లాడుతున్న శంకర్రావు

ప్రజాశక్తి-ముంచింగి పుట్టు:మండలంలో వనుగుమ్మ గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిని నియమించాలని సిఐటియు మండల కార్యదర్శి కొర్ర శంకర్రావు డిమాండ్‌ చేశారు. పాఠశాలను సందర్శించిన ఆయన మాట్లాడుతూ, ఈ పాఠశాలలో 60 మంది విద్యార్థులు ఉండగా ఇద్దరి ఉపాధ్యాయు లతో నడుస్తుందని, ఈ పరిస్థితిలో ఈ మధ్యకాలంలో ఒక ఉపాధ్యాయుడిని డిప్యూటేషన్‌పై కిలగడ ఆశ్రమ పాఠశాలకు పంపించారన్నారు. దీంతో విద్యార్థులకు సక్రమంగా విద్యా బోధన అందటం లేదని తెలిపారు.ప్రతి సబ్జెక్టుకు ఒక ఉపాధ్యాయుడిని నియమించి మెరుగైన విద్యాభ్యాసం అందించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు కె.విక్రమ్‌, శాంతన్న, సద్దునా, ఎస్‌.రాజు పాల్గొన్నారు.