Oct 10,2023 23:38

నాగటి నారాయణ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పిస్తున్న నాయకులు

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : యుటిఎఫ్‌ నేత నాగటి నారాయణ లేని లోటు విద్య రంగానికి తీరనిదని యుటిఎఫ్‌ పల్నాడు జిల్లా అధ్యక్షులు పి.ప్రేమ్‌కుమార్‌ అన్నారు. యుటిఎఫ్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన నాగటి నారాయణ ప్రథమ వర్ధంతిని నరసరావు పేటలోని యుటిఎఫ్‌ పల్నాడు జిల్లా కార్యా లయంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి నాయకులు పూలమాలలేసి నివాళులర్పిం చారు. అనంతరం నిర్వహించిన సభకు ప్రేమ్‌కుమార్‌ అధ్యక్షత వహించి మాట్లా డారు. 2000 సంవత్సరంలో కాకినాడలో జరిగిన రజతోత్సవాల్లో బాధ్యతలు చేపట్టిన నాటి నుండి రాష్ట్ర విభజన జరిగే వరకు ఉమ్మడి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షునిగా, ఎస్‌టిఎఫ్‌ఐ జాతీయ ఉపాధ్యక్షునిగా నారాయణ సుదీర్ఘకాలం పని చేశారని గుర్తు చేశారు. యుటిఎఫ్‌ బలోపేతంతో పాటు ఉపాధ్యాయ సమస్య లపై అనేక ఉద్యమాలు నడిపారన్నారు. గిరిజన విద్యాభ్యున్నతి, ఉపాధ్యాయుల సంక్షేమం, హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేశారని కొనియాడారు. సోదర ఉపాధ్యాయ సంఘాలతో కలిసి ఐక్య ఉద్యమాలలో అగ్రగామి నాయకుడిగా వ్యవహరించారని, అనేక విజయాలు సాధించడంలో కీలకమైన పాత్ర పోషిం చారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా సంఘం విస్తరణ, బలోపేతానికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. కార్యకర్తలను గుర్తించి నాయకులుగా తీర్చిదిద్దారని, పిఆర్‌సి చర్చ సందర్భంగా ముఖ్యమంత్రిని సైతం ఢకొీన్న ధైర్యశాలి అని కొనియా డారు. యుటిఎఫ్‌ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి జి.విజయసారధి మాట్లాడుతూ నాగటి నారాయణకు పల్నాడు ప్రాంత ఉపాధ్యాయులతో విడదీయరాని అను బంధం ఉందన్నారు. పల్నాడు ప్రాంత ంలో అనేక ఉద్యమ శిక్షణ తరగతులు బోధించి కార్యకర్తల్లో ఉద్యమ స్ఫూర్తి నింపా రని అన్నారు. ఆయన వ్యక్తిత్వం, అలు పెరగని పోరాట పటిమ ఆదర్శనీయమ న్నారు. కార్యక్రమంలో నాయకులు ఎం.మోహన్‌రావు, ఎ.భాగేశ్వరిదేవి, జమా ల్‌, ఖాసింపీరా, కె.రవిచంద్రశేఖర్‌, వై.శ్రీని వాసరావు, కె.వెంకటేశ్వరరావు, డి.కోటేశ్వ రరావు, పి.యోనా, షరీఫ్‌ పాల్గొన్నారు.