May 02,2023 17:20

దాచూరి రామిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న యుటిఎఫ్‌ నాయకులు

ఉపాధ్యాయ ఉద్యమానికి దాచూరి రామిరెడ్డి సేవలు అంకితం


ప్రజాశక్తి - డోన్‌

ఉపాధ్యాయ ఉద్యమానికి దాచూరి రామిరెడ్డి సేవలు అంకితం అని రాష్ట్ర పూర్వ గౌరవాధ్యక్షులు నర్సింహులు, రాష్ట్ర ఆడిట్‌ కమిటీ సభ్యులు ఎం.వెంకట సుబ్బారెడ్డి, జిల్లా పూర్వ గౌరవాధ్యక్షులు ఎన్‌.ఎస్‌.బాబు, జనవిజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి మాణిక్యం శెట్టి, మండల ప్రధాన కార్యదర్శి గోపాల్‌, మండల గౌరవాధ్యక్షులు లక్ష్మయ్య, ప్యాపిలి మండల ప్రధాన కార్యదర్శి నరసింహరెడ్డిలు అన్నారు. మంగళవారం డోన్‌ పట్టణం లోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల పాతపేట నందు దాచూరి రామిరెడ్డి వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా దాచూరి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాచూరి ఉపాధ్యాయ ఉద్యమ నేతగా ఉంటూనే 1970లో ప్రకాశం జిల్లా కామన్‌ ఎగ్జామినేషన్‌ బోర్డు కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి పరీక్షా విధానంలో నూతన ఒరవడి తెచ్చారన్నారు. యుటిఎఫ్‌ ఆవిర్భావం నుంచీ ఆయన రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తుండేవారని,రాష్ట్ర అధ్యక్షునిగా 20సంవత్సరాలు పనిచేశారని,ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి సంఘాలు చేసే పోరాటాలను శాసన మండలి వేదికపై ప్రతిబింబించేవారని,శాసనమండలి సభ్యునిగా తీసుకున్న అలవెన్సులు సంఘానికి జమచేసి, సంఘం ఇచ్చిన నామమాత్రపు అలవెన్సుతో సాధారణ జీవితం గడిపిన ఆదర్శమూర్తి అని కొనియాడారు. పాలకులు ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కదాన్ని తుంగలో తొక్కుతు న్నారని, దాచూరిని స్ఫూర్తిగా తీసుకొని ఉమ్మడిగా పోరాడవలసిన సమయ ము ఆసన్నమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు బి.వై.సుబ్బారాయుడు, రాజశేఖర్‌,అబ్దుల్‌ లతీఫ్‌,సర్వజ్ఞ మూర్తి,క్రిష్ణ నాయక్‌,రఘునాయక్‌,చంద్రమోహన్‌,రాజా కుల్లాయప్ప,సుమన్‌ తదితరులు పాల్గొన్నారు.