ప్రజాశక్తి-రాజవొమ్మంగి
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కోసం యుటిఎఫ్ నిరంతర పోరాటం చేస్తుందని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు వై.విల్సన్ బాబు అన్నారు. స్థానిక ఎంఆర్‌సి కార్యాలయంలో బుధవారం యూటీఎఫ్ మండల నూతన కార్యవర్గం ఎన్నిక యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి సొర్లం రాజబాబు ఆధ్వర్యంలో జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన విల్సన్‌బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో యుటిఎఫ్ లక్షా 30 వేల సభ్యత్వం కలిగి అతి పెద్ద సంఘంగా ఉందని తెలిపారు. ఉపాధ్యాయుల పక్షాన నిలబడి అలుపెరగని పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో పిడిఎఫ్ ఎమ్మెల్సీల గెలుపునకు ఉపాధ్యాయులందరూ కృషి చేయాలని కోరారు.
మండల కమిటీ ఎన్నిక
అనంతరం యుటిఎఫ్ మండల నూతన కమిటీ ఎన్నిక జరిగింది. మండల అధ్యక్ష, కార్యదర్శులుగా పి.రమణ, డి పైడిమల్లు, గౌరవ అధ్యక్షులుగా మిరియాల సత్యవతి, ఉపాధ్యక్షులుగా పీవీ సుబ్బారావు, టీవీఎల్ ప్రసన్న, కోశాధికారిగా కె.శ్రీను, ఎఫ్‌డబ్ల్యు కార్యదర్శిగా బి.శ్రీను, పత్రికా కార్యదర్శిగా కె శ్రీను, మండల ఆడిటర్‌గా ఎ.సతీష్, కార్యదర్శులుగా జి త్రినాథ్, బి మురళీకృష్ణ, ఎం రాజబాబు, ఈ బాపూజీ, జె రాంబాబు, ఎస్ విజరు కుమారి తదితరులు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా నాయకులు కె.కృష్ణ, పి.మంగరాజు, ఉదరు ఉపాధ్యాయులు శాంతి పాప, లక్ష్మీబాయి, ఆర్ లక్ష్మి, రమణ, వెంకటలక్ష్మి, సత్యవతి, జి అప్పారావు, జి ఝాన్సీ రాణి, కె లోవరాజు, సత్యనారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు.










